న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్​ హిప్కిన్స్​

-

  • జెసిండా ఆర్డెర్న్​ రాజీనామాతో న్యూజిలాండ్​ ప్రధాని పోస్టు ఖాళీ అయింది. అయితే తదుపరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్​కు కొత్త ప్రధాన మంత్రిగా.. ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్​ హిప్కిన్స్​ ఎన్నిక కానున్నారు. జెసిండా స్థానంలో పోటీలో క్రిస్​ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం తన లేబర్​ పార్టీలోని సభ్యులతో ఆమోదం పొందాలి. పోటీలో ఒక్కరే ఉండటం వల్ల సభ్యుల ఆమోదం పొందడం ఇక లాంఛనమైంది.

ఆ స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్ల.. చట్ట సభ్యులు హిప్కిన్స్​ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిప్కిన్స్​కు దాదాపు 8 నెలల సమయం ఉంది. తన ప్రత్యర్థి కన్జర్వేటివ్​ పార్టీ కంటే లేబర్​ పార్టీ వెనుకంజలో ఉందని ఓపీనియన్ సర్వేలు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో లేబర్​ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత హిప్కిన్స్​పై ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news