కలకలం రేపుతున్న టీటీడీ డ్రోన్‌ వీడియో వ్యవహారం

-

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి పటిష్ట భద్రతా ఉంటుంది. అలిపిరి నుంచి మొదలుపెట్టి తిరుమల కొండపై ఎక్కడ, ఏం జరిగినా.. చీమ చిటుక్కుమన్నా టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. కళియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ ‘నో ఫ్లై జోన్’. విమానాలు, హెలికాప్టర్లకే ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం అలజడి రేపుతోంది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే తిరుమల కొండపై డ్రోన్ కెమెరా ఎలా ఎగిరింది? ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారు? విజిలెన్స్ సిబ్బంది ఎందుకు కనిపెట్టలేకపోయారు? తిరుమల వ్యాప్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలు ఉండగా.. ఎందులోనూ ఈ డ్రోన్‌ కెమెరా ఎందుకు బయటపడలేదు? అసలు ఇది నిజమేనా? నకిలీ వీడియోనా? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికారులతో పాటు సామాన్య భక్తులను వేధిస్తున్నాయి.

TTD signs pact to install energy efficient fans

తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఈ అకౌంట్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి డ్రోన్ కెమెరా దృశ్యాలేనా, లేకపోతే గూగుల్ త్రీడీ ఇమేజెస్ కావొచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఫోరెన్సిక్ బృందానికి పంపించి నివేదిక కోరారు. ఈ ఘటనపై విజిలెన్స్ యంత్రాంగం దర్యాప్తు జరుపుతోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news