అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కరోనా వచ్చినా సరే ఆయనతో ఇప్పుడు ఎవరికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చారని, ఎన్నికల ప్రచారం స్వేచ్చగా నిర్వహించవచ్చు అని ఒక అమెరికా అత్యున్నత అధికారి చెప్పారు. ఇతరులను ప్రమాదంలోకి ఆయన పడేయలేరు అని పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత ప్రజా ఆరోగ్య అధికారి ఆంథోనీ ఫౌసీ ఒక మీడియా సంస్థకు చెప్పారు.
తాను కరోనా బారిన పడ్డాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల మొదటి వారంలో ప్రకటన చేసారు. ఆ తర్వాత ఆర్మీ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ఇంకా కొన్ని రోజులే ఉండటంతో దూకుడుగా చేస్తున్నారు.