తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొంప ముంచుతున్నాయి. నిన్న అంతా కాస్త తగ్గినట్టు అనిపించిన వర్షం మళ్ళీ రాత్రి పదిన్నర సమయాన మళ్ళీ మొదలయింది. దీంతో మళ్ళీ ఎక్కడికక్కడ తేరుకుంటున్న వారికి శరాఘాతం తప్పలేదు. అయితే మొన్న భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్ మైలార్‌దేవుపల్లిలోని పల్లె చెరువుకు గండి పడిన సంగతి తెలిసిందే. చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి వరద నీరు కిందకు ప్రవహిస్తోంది.
ఏ క్షణమైనా పూర్తిస్థాయిలో చెరువు కట్ట ధ్వంసమయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తెల్లవార్లు అక్కడే ఉండి సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిస్థితిని సమీక్షించారు. ఒకవేళ పూర్తిగా కట్ట తెగితే అల్ జుబేల్ కాలనీ, అలీ నగర్, గాజీ మిలన్ కాలనీ, నింరా కాలనీ, ఉప్పు గూడా, లలితా బాగ్ లోని లోతట్టు ప్రాంతాలు నీట్ మునిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.