మరో వివాదంలో రిషి సునాక్.. ఈసారి ‘పెన్ను’పై

-

బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రిషి సునాక్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛాన్సలర్‌గా ఉన్న సమయం నుంచి రాసిన దాన్ని తుడిచేసే వీలు కల డిస్పోజబుల్‌ ‘పైలట్‌ వి’ పెన్నులను రిషి వినియోగిస్తున్నారు. ప్రధాని అయిన తర్వాతా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారు. 15 రోజుల క్రితం కేబినెట్‌ సమావేశంలోనూ సునాక్‌ చేతిలో ఈ పెన్ను కనిపించింది.

ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. ఈ పెన్నుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెన్నుతో రాసినవి తుడిచేసే వీలు ఉండటంతో ఇది భద్రతాపరంగా అంత సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ‘ది గార్డియన్‌’ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

సునాక్‌ మీడియా కార్యదర్శి మాట్లాడుతూ.. ‘‘ఈ పెన్నును సివిల్‌ సర్వీస్‌లో విరివిగా వినియోగిస్తారు. ప్రధాని ఎప్పుడూ ఈ పెన్నుతో వాక్యాలను రాసి తుడిచేసే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో చేయరు కూడా..!’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news