ఇందుకోసమా మా తాత జైలుకెళ్లింది..? : యూఎస్‌ చట్టసభ్యుడు రో ఖన్నా

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకులే కాదు.. సినీ ప్రముఖులు కూడా రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా గా ఈ పరిణామాలపై భారత అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ అనర్హత వేటును ఖండించారు.

‘రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. మా తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది’ అని అంటూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news