ఇవాళ మధ్యాహ్నం రాహుల్‌ గాంధీ ప్రెస్ మీట్.. ఏం చెప్పనున్నారు..?

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాహుల్‌ గాంధీ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.  దీంతో అనర్హత వేటుపై  రాహుల్‌ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు గురువారం రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం రాహుల్‌పై చర్యలు తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనర్హతపై రాహుల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news