ఉక్రెయిన్‌కు డేంజర్.. పుతిన్ నోట అణుబాంబు మాట

-

ఉక్రెయిన్‌కు అణుబాంబు ముప్పు తప్పదా అంటే అవుననే అన్పిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా వ్యాఖ్యలు ఈ మాటకు ఊతం ఇస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా.. అణ్వాయుధాలనూ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తాజాగా పుతిన్.. తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌తో జరిపిన సంభాషణలో భాగంగా.. యుద్ధంలో గెలిచేందుకు ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదంటూ జపాన్‌పై జరిగిన అణు దాడులను పుతిన్‌ ప్రస్తావించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న పుతిన్‌ ఆలోచనలను ఈ వ్యాఖ్యలు బలోపేతం చేస్తున్నాయని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ సేనల ప్రతిదాడులతో యుద్ధక్షేత్రంలో కొంతకాలంగా మాస్కోకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో.. రష్యాను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి.. రష్యా అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news