ఆఫ్ఘనిస్తాన్ లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. మహిళల హక్కులను కాలరాయొద్దంటూ నిరసనకు దిగిన మహిళలపై తాలిబన్లు హింసాత్మక చర్యలకు దిగారు. 6నుండి 12ఏళ్ల లోపు ఉన్న బాలికలను పాఠశాలకు అనుమతించాలంటూ ఒకానొక సెకండరీ పాఠశాల ముందు మహిళలు నిరసనకు దిగారు. ఈ నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాలిబన్లు, హింసాత్మ చర్యలకు పూనుకున్నారు. మా పెన్నులు విరగ్గొట్టద్దని, పుస్తకాలను కాల్చొద్దని, పాఠశాలలు మూసివేయొద్దని పాఠశాల ముందు బ్యానర్లు పట్టుకుని నిరసన చేస్తున్న మహిళల చేతుల్లోని ప్లకార్డులు లాక్కుని, పాఠశాల ముందు నుండి వెళ్ళిపోవాలని ఆగ్రహానికి గురయ్యారు.
అంతేకాదు మహిళల నిరసనను అదుపు చేయడానికి గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారంటూ నిరసనకు దిగితే నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా చేయడం బాధాకరం. తాలిబన్ల పాలనలో మహిళలకు సరైన హక్కులు ఉండట్లేదని ఆఫ్ఘనిస్తాన్ మహిళలు చింతిస్తున్నారు.