రష్యన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ కీలక అడుగు వేస్తుంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకాను స్పుత్నిక్ వీ తో కలిపి దాని సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నించాలని ప్రకటన చేసారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక తయారీ లోపాన్ని గుర్తించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేసారు. వ్యాక్సిన్లను కలపడానికి ప్రయత్నించమని ఆస్ట్రాజెనెకాను సూచనలు చేసారు.
వ్యాధిని నివారించడంలో వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలు అత్యంత ప్రభావవంతమైనవి అని భావిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ 70% కరోనాను కట్టడి చేస్తుంది. సోమవారం ఈ ప్రకటన చేసారు. కోవిడ్ -19 నుండి ప్రజలను రక్షించడంలో తన స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ 92 శాతం ప్రభావవంతంగా ఉందని రష్యా ఇంతకుముందు ప్రకటన చేసింది.