ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు చిన్నదే కావచ్చు కానీ.. మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మాత్రం ఏ దేశాలకు మేము ఇవ్వలేదని అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అన్నారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని మాల్దీవులకు చేరుకున్న అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
మార్చి 15 వరకల్లా భారత సైన్యం వెళ్లిపోవాలి. మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జ ఇండియాకి డెడ్ లైన్ విధించారు. భారత మిలటరీ మార్చి 15 వరకు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. చైనాలో తొలిసారి పర్యటించారు. మాల్దీవుల్లో భారత సైనికులు ఉండకూడదనేది మయిజ్జు పాలసీ అని ఆ దేశ ప్రెసిడెంట్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు.