చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కొన్ని కీలక సూచనలు చేసారు. సైన్యాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి చైనా పిఎల్‌ఎ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు నిజమైన పోరాట పరిస్థితులలో అవసరమైన మెరుగైన శిక్షణను ఉపయోగించుకోవాలని చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) అధిపతి జి జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
జిన్‌పింగ్ తాను చైర్మన్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) సమావేశంలో మాట్లాడుతూ… చైనాలో, రెండు మిలియన్ల మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) సైన్యం ఉంది అని అన్నారు. చైనా మిలిటరీని బలోపేతం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ… జి జిన్‌పింగ్ కూడా పిఎల్‌ఎను ప్రపంచ స్థాయి శక్తిగా మార్చడానికి కొత్త రకం సైనిక శిక్షణా వ్యవస్థను వేగంగా ఏర్పాటు చేయాలని అన్నారు. భారత్, చైనా సరిహద్దులలో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.