కరోనా టీకా.. డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

-

క‌రోనా వైర‌స్‌ను అంతం చేసే దిశ‌గా అమెరికా చ‌క‌చ‌కా అడుగులు వేస్తోంది. దేశ పౌరుల‌ను కాపాడుకునేందుకు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎంత‌వేగంగా వీలైతే అంత‌వేగంగా క‌రోనా టీకాను త‌యారు చేసి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చే దిశ‌గా క‌దులుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2021 ఏప్రిల్ నాటికి ప్ర‌తీ అమెరిక‌న్ పౌరుడికి క‌రోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని విలేక‌రుల స‌మావేశంలో చెప్పారు. టీకాను ఆమెదించిన వెంట‌నే అవ‌స‌ర‌మైన మోతాదులో తయారు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

Trump
Trump

కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, మూడు టీకాలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇలా వ్యాక్సిన్లకు సంబంధించి చాలా పనులు జరుగుతున్నాయని, మహమ్మారిని అంతం చేసి జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి త‌మ‌ మొదటి ప్రాధాన్యత అని, టీకా ఆమోదించిన‌ 24 గంటల్లో పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. కాగా, అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 6,705,114 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 198,197మంది మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news