అతడిని చంపిద్దామనుకున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. అటువంటి యోచనే తనకు రాలేదని గతంలో ప్రకటించిన ట్రంప్.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన చేసినట్టు అంగీకరించారు.

‘అసద్‌ను చంపిద్దామనుకున్నాను. ఈ విషయామై ఓ నిర్ణయానికి కూడా వచ్చాను..కానీ మాటిస్ దీనికి అంగీకరించలేదు’ అని ట్రంప్ తెలిపారు. మాటిస్ కారణంగానే తాను వెనక్కు తగ్గానని తెలిపారు. జేమ్స్ మాటిస్ అప్పట్లో ట్రంప్ ప్రభుత్వంలో డిఫెన్స్ సెక్రెటరీగా సేవలందించారు.