15 వారాల గర్భవతులకు అబార్షన్లపై నిషేధానికి ట్రంప్‌ మద్దతు

-

పదిహేను వారాల గర్భవతులకు అబార్షన్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో నిషేధానికి మద్దతు పలకనున్నట్లు తెలిపారు. నిషేధాన్ని డెమోక్రాట్లు సమర్థించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మంగళవారం డబ్ల్యూఏబీసీ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. 15 వారాల గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి ప్రజలంతా మద్దతిస్తున్నారని, అదే దిశగా తానూ ఆలోచిస్తున్నానని తెలిపారు. ఇది సరైనదేనని పేర్కొన్నారు.

మరోవైపు తాను అధికారంలోకి వస్తే బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో అమెరికా వీసా పొందే సమయంలో ఆయన తన డ్రగ్స్ వినియోగం హిస్టరీని వెల్లడించలేదని, ఎవరైనా ఈ విషయంలో తప్పుడు సమాచారమిస్తే.. వారికి భారీగా జరిమానా విధించడంగానీ, తిరిగి వెనక్కి పంపే అధికారంగానీ అమెరికాకు ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. మంగళవారం రోజున జరిగిన ఇల్లినాయీస్, ఫ్లోరిడా, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news