ట్రంప్ కి వరుస షాక్ లు ఇస్తున్న ట్విట్టర్…!

డొనాల్డ్ ట్రంప్ గత రెండు రోజులుగా నిరంతరాయంగా ట్వీట్ చేస్తూ అమెరికా ఎన్నికల విధానంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపుని ఆపాలి అంటూ ఆయన డిమాండ్ చేసారు. అయితే ఈ ట్వీట్ ల విషయంలో ట్విట్టర్ జాగ్రత్తగా గమనిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ లు అన్నీ కూడా… అనుచితమైనవి లేదా తప్పుదోవ పట్టించేవిగా ట్విట్టర్ గుర్తించింది.

నవంబర్ 4 నుండి, డోనాల్డ్ ట్రంప్ చేసిన 12 ట్వీట్లను ట్విట్టర్ ఒక సందేశంతో బయటి ప్రపంచానికి చూపిస్తుంది. “ఈ ట్వీట్లో పంచుకున్న కొంత లేదా మొత్తం కంటెంట్ వివాదాస్పదంగా ఉంది. ఎన్నికలను ఇతర చర్యలను తప్పుదారి పట్టించవచ్చు.” అని ట్విట్టర్ పేర్కొంది. ఆలస్యంగా వేసిన బ్యాలెట్లను లెక్కింపు నుండి మినహాయించాలని ట్రంప్ వైట్ హౌస్ నుండి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. జో బిడెన్ 264 ఓట్లతో అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి సిద్దంగా ఉన్నారు.