బ్రెజిల్ లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక పెట్రో పోలీస్ పట్టణంలో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.
ఇక శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని.. క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు భారీ వర్గాలు ఆగకుండా కురుస్తున్నాయని రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బ్రెజిల్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.