కోవిడ్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని US CDC వెల్లడించింది…!

కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కి సంబంధించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని… కంటికి కనిపించని చిన్న పార్టికల్స్ శ్వాస తీసుకునే క్రమంలో గాలిలో కలుస్తాయని చెప్పారు.

శుక్రవారం నాడు పబ్లిక్ గైడ్లైన్స్ ని విడుదల చేశారు. రెండు విధాలుగా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఎవరైనా వైరస్ సోకిన వాళ్ళు ఇతరులతో మాట్లాడినప్పుడు రెస్పిరేటరీ ఫ్లూయిడ్స్ ఆధారంగా వ్యాపించవచ్చు అని లేదా గాలిలో ఉన్న చిన్నపాటి డ్రాప్లెట్స్ ద్వారా కూడా వ్యాపించవచ్చు అని వెల్లడించారు.

పెద్ద పెద్ద డ్రాప్లేట్స్ కొన్ని సెకండ్లలో సెటిల్ అయిపోతాయి అని చిన్నవి మాత్రం గాలి లోకి వెళ్ళి పోతాయని చెప్పారు. వైరస్ బారిన పడిన వాళ్ళకి ఆరు అడుగుల దూరం లో ఉండాలని చెప్పారు అయితే గాలిలో ఉండే వైరస్ 15 నిమిషాల నుండి గంటల పాటు కూడా ఉండొచ్చని అన్నారు.

యూకే, యూఎస్ మరియు కెనడా నుండి ఆరుగురు నిపుణులు దీనిమీద పరిశీలించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జూలై 2020లో ఎక్కువ మంది ఉన్నచోట గాలి ద్వారా వైరస్ వ్యాపించవచ్చు అని కూడా చెప్పింది.

వెంటిలేషన్ సరిగ్గా లేని చోట సులువుగా ఇది వ్యాపించవచ్చు. అందుకనే వెంటిలేషన్ లేని చోట్ల వైరస్ బారిన పడిన వాళ్లతో పాటు ఉండడం మంచిది కాదు.. డ్రాప్లెట్ ద్వారా మాత్రమే కాకుండా గాలి ద్వారా కూడా ఇది సోకుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు.