నవంబర్‌లో అమెరికా ఎన్నికలు ఎందుకంటే..?

-

అమెరికా ఎన్నికల గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది..నాలుగేళ్లకోసారి జరిగే ఈ అగ్రరాజ్య ఎన్నికలంటే అందరికి ఆసక్తే.. చాలా దేశాలు అమెరికా ఎన్నికల కౌంటింగ్‌పై దగ్గరగా పరిశీలిస్తున్నాయి.మరి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కౌంటింగ్‌పై ఎక్కువ ఆస్తకితో చూస్తున్నాయి..అమెరికా అధ్యక్షుడిగా ఎవరి గెలిచిన భారత్ వంటి అగ్ర రాజ్యంతో సఖ్యతను కొనసాగించాలి చూస్తాయి..ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నారు..జో బైడెన్‌ వైట్ హౌస్‌ భాధ్యలలు చేపట్టడానికి కొద్ది రదూరంలోనే ఉన్నారు..అయితే తుది ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది..ఇరు పార్టీల అభ్యర్థులు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే అమెరికా ఎన్నికల నిర్వహణకు ఒక ప్రత్యేక ఉంది..ప్రతి సారి అమెరికాలో ఎన్నికలు నవంబర్‌ 3న మాత్రమే జరుగుతాయి..అది కూడా తొలి మంగళవారం రోజునే ఎందుకు నిర్వహిస్తారు..దానికి కారణం లేకపోలేదు.అమెరికా ఎన్నికల సిస్టంకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది..అమెరికా ఎన్నికలకు 1845 ముందు వరకు ప్రస్తుతం ఉన్నట్లు ఎన్నికల తేదీ ఉండేది కాదు..డిసెంబర్‌ నెల మొదటి బుధవారానికి ముందు 34 రోజుల లోపల ఆయా రాష్ట్రాల్లో వీలును బట్టి ఎన్నికలు నిర్వహించేవారు..అయితే, ఈ విధానం వల్ల ఎవరు గెలవబోతున్నారో ముందే తెలిసే అవకాశముందని, ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని రాజకీయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లు.. దీంతో దేశవ్యాప్తంగా ఒకేరోజున పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అలా 1845లో అప్పటి ప్రభుత్వం నవంబర్‌ నెలలో వచ్చే తొలి మంగళవారాన్ని పోలింగ్‌ నిర్వహించే రోజుగా ప్రకటించింది.. అప్పటి నుంచి ఏ ఎన్నికలు చూసుకున్నా..నవంబర్‌ 2 నుంచి పోలింగ్‌ జరుగుతూ వస్తోంది.

నవంబర్‌ 2 ఎన్నికలు జగరటానికి అప్పటి రైతులే కారణం..19వ శతాబ్దంకు ముందు అమెరికాలో ఎక్కువగా రైతులే ఉండేవారు..చాలా ఏరియల్లో గ్రామాల్లోనే జీవనం కొనసాగించే వారు..రవాణ వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు..అలాంటి పరిస్థితిలో రైతులు ఓటు వేయాలంటే కత్తి మీద సాములాంటిదే..దీనికి పరిష్కారం కనుగోవాలన్న ఉద్ద్యేశంలో అందిరికి అనుకూలంగా ఉండే నవంబర్‌ నెలను ఎంచుకున్నారు..ముఖ్యంగా నవంబర్‌ నెల మొదటి మంగళవారాన్ని ఎంచుకున్నారు..శుక్ర, శనివారాలు వారాంతం కావడంతో అధికారులు సెలవుల్లో ఉంటారు..ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు..ఆదివారం ప్రజలంతా చర్చిలో ప్రార్థనలు చేసి, సరదాగా గడుపుతారు.. అ సమయంలొ అధికారులు పోలింగ్ నిర్వహించడం అసాధ్యం..మరోవైపు అమెరికాలో జులైలో ప్రారంభమైన పంట కోతలు అక్టోబర్‌ మధ్య వరకూ కొనసాగుతుంది..పండించిన పంటలను అమెరికన్‌ రైతులు బుధవారం రోజు మార్కెట్లలో విక్రయిస్తారు.. ఆ రోజున వారికి వ్యాపారం జరిగే రోజు కాబట్టి ఓట్లు వేయడానికి ఎక్కువ సంఖ్యలో రైతులు పోలింగ్ స్టేషన్‌ రారు..దీంతో దేశంలో పోలీంటగ్ శాతం ఘననీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి..అందుకే అప్పటి ప్రభుత్వం నవంబర్‌లో పోలింగ్ నిర్వహించాలిని ఎంచుకుంది..

నవంబర్‌ తొలి మంగళవారం నిర్వహించిన ఎన్నికలు..డిసెంబర్‌ నెలలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది..అధ్యక్షుడిగా గెలుపొందిన అభ్యర్థి..జనవరి నెలలో బాధ్యతలు తీసుకోవచ్చని యోచించారు.
సోమవారం రాత్రి వరకు వారి స్థానిక పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని మంగళవారం ఓటు వేసి తిరుగుపయనమయితే.. బుధవారం మళ్లీ వారి వ్యాపారం చేసుకునే వీలు ఉంటుంది. అందుకే నవంబర్‌ నెల తొలి మంగళవారాన్ని పోలింగ్‌ రోజుగా చట్టం చేశారు. ఇప్పటికే అదే సాంప్రాదాయాన్ని అనుసరిస్తుంది..టెక్నాలజీ, రవాణ వ్యవస్థలో పరమంగా ఎంతో ముందున్న అమెరికా పాత విధానాన్ని ఫాలో కాడం హర్షించ దగ్గ విషయం..మరోవైపు ఎన్నికల కౌంటింగ్ లేటుకావడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు..కౌంటింగ్ లేటు వాడం వల్ల దేశంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news