ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించమని పుతిన్‌కు చెప్పండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

-

రష్యా, భారత్ ల మధ్య స్నేహంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా,  ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్‌కు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పింది. ‘చట్టవిరుద్ధమైన’ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని భారత్ ను అగ్రరాజ్యం కోరింది.

‘‘రష్యాతో భారత్‌కు సుదీర్ఘ బంధం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. దాన్ని ఉపయోగించుకోవాలని భారతదేశాన్ని అమెరికా ప్రోత్సహిస్తోంది. రష్యాతో పటిష్ఠ బంధం, దాని వద్ద ఉన్న విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని కోరుతున్నాం. చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయనకు చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితి నిబంధనలను గౌరవించాలని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించమని చెబుతున్నాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news