సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్‌

-

ప్రభుత్వ స్కూళ్లలో గత కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కేసీఆర్‌ ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రస్తత ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని కేటీఆర్ కోరారు.

మరోవైపు తమిళనాడులోని ఎయిడ్‌ స్కూళ్లలో కూడా ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్‌ సోమవారం ప్రారంభించగా.. తెలంగాణలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు. విద్యార్థుల హాజరు పెంచడం.. పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండేలా చూడటం. తల్లిదండ్రులపై భారం తగ్గించడం వంటి ప్రధాన ఉద్దేశాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 6న సర్కారు బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత కొన్ని స్కూళ్లలోనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినా క్రమంగా పెంచుకుంటూ పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news