భారత్, చైనా సరిహద్దుల్లో గత నెల చివర్లో ఏం జరిగింది…?

భారత్ మరియు చైనా మధ్య సుదీర్ఘమైన ప్రతిష్టంభన నేపధ్యంలో ఆగస్టు 29-30 తేదీల్లో లడఖ్‌ లోని పంగోంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున భారత మరియు చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మొదటిగా గాల్లోకి కాల్పులు జరిగాయని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. లడఖ్‌ లోని పంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున పిఎల్‌ఎ ప్రణాళికను అడ్డుకోవటానికి భారత సైన్యం ముందస్తుగా మోహరించింది.

ఆ తరువాత, చైనా దళాల అనుమానాస్పద కదలిక ఉత్తర ఒడ్డున కూడా కనిపించింది. అప్పుడు భారత సైన్యం సరస్సు ఉత్తర ఒడ్డు ఎగువ భాగంలో కూడా భారీగా బలగాలను మోహరించింది. సెప్టెంబర్ 8 న, చైనా పిఎల్‌ఎ ఇండియన్ ఫార్వర్డ్ పొజిషన్లను మూసివేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కూడా రెండు దేశాల మధ్య గాల్లోకి కాల్పులు జరిగాయి అని భారత ఆర్మీ వెల్లడించింది.