ఆఫ్ఘనిస్తాన్: మొదలైన తాలిబన్ల వేట… శాంతి ఎక్కడ?

-

అష్రాఫ్ ఘని ప్రభుత్వాన్ని పడగొట్టి, ఆఫ్ఘనిస్తాన్ ని వశం చేసుకున్న తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చూపుతున్నారు. పంజ్ షేర్ లోనూ తమ జెండా ఎగరవేసిన తాలిబన్లు త్మ వ్యతిరేకులపై విరుచుకుపడుతున్నారు. అష్రాఫ్ ఘని ప్రభుత్వంలో పనిచేసిన వారిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడు రోహుల్లా సలైని అతి దారుణంగా చంపేసారు. కాబూల్ ని విడిచి, పంజ్ షేర్ కి వెళ్ళిన రోహుల్లాని అక్కడికి వెళ్ళి మరీ మట్టుబెట్టారు.

అంతేకాదు తమకు వ్యతిరేకంగా అనిపించిన వారందరినీ, షరియ నిబంధనలు పాటించని వారిని కూడా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల మాటలు అందరికీ గుర్తొస్తున్నాయి. అధికారం చేతిలోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొల్పుతామని ప్రకటించారని, కానీ అధికారం హస్తగతం చేసుకున్నా హింస చెలరేగుతుందని వాపోతున్నారు. మరి ఈ మారణకాండకు అంతం ఎక్కడో, శాంతి ఎప్పుడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news