మాస్క్ లేకుండా పెయింట్ తో కవర్ చేసిన మహిళలు.. పాస్ పోర్ట్ సీజ్..

-

కరోనా పెరుగుతున్న వేళ మాస్క్ లేకుండా బయటకి వెళ్తే ఎటువంటి జరిమానా ఉంటుందన్న విషయంలో మాస్క్ లేకుండా వస్తే పెద్ద చర్యలే ఉంటాయని చెప్పేలా ఇండోనేషియా బాలి ప్రభుత్వం వ్యవహరించింది. వివరాల్లోకి వెళ్తే బాలి లో ఒకానొక సూపర్ మార్కెట్లో ఇద్దరు మహిళలు ఎంటర్ అయ్యారు. వారిద్దరూ మాస్క్ ధరించలేదు. కానీ ధరించినట్టు కనిపించారు. దానికి కారణం వాళ్ళు మాస్క్ వేసుకున్నట్టు పెయింటింగ్ తో కవర్ చేసారు. సర్జికల్ మాస్క్ రీతిలో పెయింటింగ్ వేసుకుని సూపర్ మార్కెట్లోకి వెళ్లారు.

అందులో ఒక మహిళ షాపింగ్ చేస్తుంటే మరో మహిళ వీడియో తీస్తుంది. అంతా అయ్యాక ఈ వీడియోని ఆన్ లైన్లో ఉంచారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. అంతే బాలి ప్రభుత్వం ఆ మహిళలిద్దర్నీ పట్టుకుంది. కరోనా సూచనలని తుంగలో తొక్కినందుకు పనిష్మెంట్ గా ఆ ఇద్దరి మహిళల పాస్ పోర్టులను సీజ్ చేసింది. మొత్తానికి కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చేష్టలకి ఇలాంటి ఫలితాలు రావడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news