కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది.. 2 రోజుల‌కు చ‌నిపోయింది..

-

ప్ర‌ముఖ ఔష‌ధ ఉత్ప‌త్తుల త‌యారీదారు ఫైజ‌ర్ ఇప్ప‌టికే కోవిడ్ వ్యాక్సిన్‌ను ప‌లు దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యం విదిత‌మే. ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ను ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం ఫ్రంట్ లైన్ హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు ఇస్తున్నారు. అయితే పోర్చుగ‌ల్‌లో ఓ హెల్త్ వ‌ర్క‌ర్ ఫైజ‌ర్‌కు చెందిన వ్యాక్సిన్‌ను తీసుకున్న 2 రోజుల్లో చ‌నిపోయింది. దీంతో వ్యాక్సిన్‌పై జ‌నాల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

woman took pfizer vaccine and died after 48 hours

పోర్చుగ‌ల్‌లోని పోర్టో ప్రాంతానికి చెందిన పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాల‌జీ అనే హాస్పిట‌ల్‌లో పీడియాట్రిక్స్ విభాగంలో 41 ఏళ్ల సోనియా అకెవెడో అనే మ‌హిళ హెల్త్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేస్తోంది. డిసెంబ‌ర్ 30వ తేదీన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో భాగంగా ఆమె వ్యాక్సిన్ తీసుకుంది. అయితే 48 గంట‌ల అనంత‌రం ఆమె స‌డెన్‌గా చ‌నిపోయింది. వ్యాక్సిన్ తీసుకున్నాక‌ ఆమెలో నిజానికి ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. ఇక ఆమెకు అంత‌కు ముందు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. అందువ‌ల్ల ఆమె వ్యాక్సిన్ వ‌ల్లే చ‌నిపోయింద‌ని భావిస్తున్నారు.

అయితే ఫైజ‌ర్ వ్యాక్సిన్ చాలా వ‌ర‌కు దుష్ప్ర‌భావాల‌ను క‌లిగిస్తుంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంద‌రికి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగాయి. దీంతో ఫైజ‌ర్‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ ప‌నితీరుపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే పైన తెలిపిన మ‌హిళ ఎందుకు చ‌నిపోయిందో క‌నుక్కు‌నేందుకు ప్ర‌స్తుతం సైంటిస్టులు య‌త్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news