పసిపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరగడం నిత్యకృత్యమైపోయిన సంగతి తెలిసిందే. జంతువులను కూడా వదలకుండా కామవాంఛ తీర్చుకునే సైకోల గురించి కూడా మనం విన్నాం. కానీ సభ్య సమాజం తలదించుకునేలా.. మానవజాతికే మచ్చ తెచ్చే ఓ దుశ్చర్య పాకిస్థాన్ లో జరుగుతోంది.
ఆ దేశ సైతాన్లు సమాధులు తవ్వి మరీ మహిళల మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ మృగాళ్ల దుశ్చర్యలు నానాటికీ పెరిగిపోతుండటంతో కుటుంబ సభ్యులు తమ మహిళల మృతదేహాలు కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని పాక్ వార్తా సంస్థ డెయిలీ టైమ్స్ వ్యాసం ప్రచురించింది.
పాక్‌లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోందనీ… ఇప్పుడు మృతదేహాలనూ వదిలిపెట్టట్లేదని వ్యాఖ్యానించింది కుమార్తెలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కనీసం వారి మర్యాదనైనా కాపాడుకోవాలని ఇనుపకంచెలు వేశారని తెలిపింది. ఈ ఫొటో చూసి యావత్ దేశం సిగ్గుతో ఉరేసుకోవాలంటూ డైలీ టైమ్స్ విచారం వ్యక్తం చేసింది. సమాధుల వద్ద ఇనుప కంచెలు వేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.