వాట్సప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఇలా పెట్టండి..!

-

వాట్సాప్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై చాలా ఉందని మ్యూచువల్ ఫండ్ హౌసెస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ తెలిపింది. ఇక HDFC మ్యూచువల్ ఫండ్, ఆదిత్యా బిర్లా, సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ లాంటి సంస్థలు వాట్సాప్ ద్వారా లావాదేవీలను అనుమతిస్తున్నారు. ఈమధ్యనే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని నిపుణులు తెలిపారు.

whatsapp-bank
whatsapp-bank

ఇక ప్రతి ఏఎంసీ అందించే సేవలు భిన్నంగా ఉంటాయి. ఇక మీరు పెట్టుబడి పెట్టడానికి వీలుకల్పించే మ్యూచువల్ ఫండ్ హౌస్ వెబ్ సైట్ లింక్‌ కు దారి తీయడానికి ‘వాట్సాప్ బాట్’ సహాయపడుతుంది. పెట్టుబడి పెట్టేందుకు మొదటగా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దీనితో మీకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్‌ ను ఈ-మెయిల్‌ కు పంపిస్తారు. ఇక తాజాగా ఆదిత్యా బిర్లా సంస్థ మ్యూచువల్ ఫండ్స్‌ కు సంబంధించి వాట్సాప్ ద్వారా KYCని పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది. వీటితోపాటు ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ ప్రశ్నలు, ఫిర్యాదులకు సంబంధించి సేవలను అందిస్తున్నాయి. ఇందుకుగాను మీకు సంబంధిత మ్యూచువల్ ఫండ్ హౌస్‌ కు సంబంధించిన నెంబర్‌ ను ముందుగా మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి సేవ్డ్ నెంబర్‌ ను సెర్చ్ చేసి ‘హాయ్’ అని సందేశం పంపాలి. ఇక ఇప్పుడు మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలున్నట్లయితే వాట్సాప్ బాట్ ‌తో చాట్ చేసి తీర్చుకోవాలి.

ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ ‌లో కంటే ఎక్కువ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు సీఎంస్ వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టేందుకు వాట్సాప్ సేవలను ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన ప్రయోజనాల కోసం మాత్రమే అందిస్తారు. వీటితోపాటు కొత్తగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ముందు సమగ్రంగా తెలుసుకోవాలి. ఇక ఆర్థిక సలహాదారు, నిపుణులను సంప్రదించి కూడా సహాయం తీసుకోవాలి. దీనికి కారణం మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ ఒడుదొడుకులు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేముందు అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news