బ్రేకింగ్ : పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ కు గుండెపోటు..

పాకిస్తాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం పూట ఇంజమామ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ ను ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.

ఆస్పత్రిలో చేరిన ఇంజమామ్ కు.. తాజాగా యాంజియోప్లాస్టి సర్జరీ చేశారు వైద్యులు.
ప్రస్తుతం ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు వైద్యులు. వైద్యుల ప్రకటనతో… ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ క్రికెట్ సభ్యులు… విచారం వ్యక్తం చేశారు. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఆటగాళ్లు. కాగా… ఇప్పటి వరకు ఇంజామామ్‌.. పాక్‌ తరఫున 375 మ్యాచ్‌ లు ఆడి 11701 పరుగులు చేశారు. అలాగే…పాక్‌ కు విజయవంతమైన కెప్టెన్‌ గా ఎదగడమే కాకుండా… బ్యాటింగ్‌ లోనూ మంచి రికార్డు సంపాదించాడు. 2007 లో క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు ఇంజామామ్‌.