మనసుకు కష్టంగా ఉంది..మనస్సాక్షి తో ఆలోచించండి : మోహన్ బాబు

రేపు మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో స్పీడు మరింత పెరిగింది. ఇక మంచు విష్ణు తండ్రి హీరో మోహన్ బాబు ఓ ఆడియోను మా సభ్యులకు పంపి విష్ణు కు ఓటు వేయాలని కోరుతున్నారు. మోహన్ బాబు తన ఆడియోలో…. 42 సంవత్సరాలుగా నటుడిగా నిర్మాతగా మీరంతా అభిమానిస్తున్న మోహన్ బాబు ను మాట్లాడుతున్నా… తెలుగు నటీ నటులు అంతా ఒకటిగా ఉండాలని పెద్దలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు.

ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పెద్దలు కోరుకున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది సభ్యులు బజార్లో పడి నవ్వుల పాలవుతున్నారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మనసుకు కష్టంగా ఉందని… ఎవరెన్ని చేసినా మా కుటుంబం ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నా బిడ్డ మంచు విష్ణు కు ఓటు వేసి ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరారు.