ఐపీఎల్: మోడీ స్టేడియంలో పంజాబ్‌, కోల్‌కతా పోరు..ఇరు జట్ల బలబలాలు ఇవే

-

ఐపీఎల్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తోంది అహ్మదాబాద్‌. నరేంద్రమోడీ స్టేడియం వేదికగా పంజాబ్‌, కోల్‌కతా తలపడనున్నాయి. ముంబై పై విక్టరీతో రాహుల్ సేన మంచి కాన్ఫిడెన్స్‌లో ఉండగా. ఎలాగైనా గెలిచి ట్రాక్ లోకి రావాలనే పట్టుదలతో ఉంది కోల్‌కతా నైట్ రైడర్స్.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోల్‌కతాకు పెద్దగా కలిసి రాలేదు. మోర్గాన్‌ చెత్త కెప్టెన్సీ ఓవైపు..మిగితా ఆటగాళ్ల ఫర్మామెన్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. గెలిచే మ్యాచ్‌లను చేతులార పొగొట్టుకుంది. ఇవాళ పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించాకపోతే కోల్ కతా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుంది. బ్యాటింగ్‌ విభాగంలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్‌, నితీశ్‌ రానా స్ట్రైక్ రేట్‌ ఇంకా మెరుగవ్వాలి. పవర్‌ప్లేలో వీరిద్దరి స్ట్రైక్ రేట్‌ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌ మార్చే అవకాశం ఉంది.

గిల్‌ స్థానంలో రాహుల్ త్రిపాఠిని ఆడించాలని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్‌. అదే జరిగితే రాణా నెంబర్‌ త్రీగా బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ టాప్‌ త్రీ ఆటగాళ్లు బాగా ఆడితే… ఆ తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి ఉండదు. మోర్గాన్‌, దినేశ్ కార్తీక్‌, రస్సేల్‌ రాణించడానికి స్కోప్ ఉంటుంది. కోల్‌కతాతో పోలిస్తే..పంజాబ్‌ పుంజుకున్నట్లు కన్పిస్తోంది. వరుస మూడు ఓటముల తర్వాత మొన్న ముంబై పై విజయం సాధించింది. ముంబై పై 9 వికెట్ల తేడాతో గెలిచింది.

మంచి ఫామ్‌లో ఉన్న ముంబైని కేవలం 130 పరుగులకే కట్టడి చేసింది పంజాబ్. ఒకే వికెట్ కోల్పోయి..టార్గెట్‌ను 17 ఓవర్లలోనే చేధించింది. కేఎల్ రాహుల్‌, గేల్‌ ఫామ్‌లో ఉండటం అదనపు అడ్వాంటేజ్‌గా మారనుంది. మయాంక్‌ అగర్వాల్‌, పూరన్‌, దీపక్ హుడా రాణిస్తే… ఎక్కువ స్కోర్‌ చేసే అవకాశం ఉంటుంది. అహ్మదాబాద్‌ పిచ్ స్పిన్నర్ల కంటే పేస్‌కు అనుకూలం. దాంతో రెండు జట్లు ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news