ఐపీఎల్ 2023: పవర్ ప్లే లో గిల్ ను అవుట్ చేస్తే.. చెన్నై విజయం తథ్యం !

-

ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుబ్ మాన్ గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ రోజు గుజరాత్ ఫైనల్ కు చేరింది అంటే గిల్ కీలక ఇన్నింగ్స్ లు అని చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నా అంటూ నెమ్మదిగా ఆడి మరీ మ్యాచ్ లను గెలిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు రేపు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో గెలవాలి టైటిల్ కొట్టాలి అంటే మాత్రం .. శుబ్ మాన్ గిల్ ను అవుట్ చేయాల్సిందే. గిల్ పవర్ ప్లే లో అవుట్ అవ్వకపోతే ఇక చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. కాగా ఇప్పటికే చెన్నై మాస్టర్ మైండ్ ధోని తనను ఎలా అవుట్ చెయ్యాలో ఒక ప్రణాళిక వేసుకుని ఉంటాడు. అయినా గిల్ ను కంట్రోల్ చెయ్యడం అంత ఈజీ కాదు.

ఇటీవల చెన్నై ఆడిన మ్యాచ్ లలో దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ పవర్ ప్లే లోనే వికెట్లు తీస్తున్నాడు. అది క్నుక వర్క్ అవుట్ అయితే చెన్నై గెలుపు కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి చెన్నై సూపర్ కింగ్స్ గిల్ పరుగుల సునామీని ఆపుతారా ?

Read more RELATED
Recommended to you

Latest news