ముదిరాజ్ లను బీసీ-A గ్రూప్ లోకి మార్చేందుకు పోరాడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

-

వచ్చే నెల మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎన్నికల ప్రణాళికలో భాగంగా నారాయణపేటలో జరుగుతున్న జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్లకు కేసిఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముదిరాజ్లను బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం అని హామీ ఇచ్చారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.ఆగస్ట్ 15 తారీకు లోపల రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news