IPL 2024 : రాణించిన గుజరాత్ టైటాన్స్ బౌలర్లు… లక్నో స్కోర్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ,లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 21 వ మ్యాచ్ జరుగుతుంది.ఇక లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఇక బ్యాటింగ్ కి దిగిన ఓపెనర్లలో క్వింటాన్ డికాక్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన పడికల్ 7 పరుగులకి పెవిలియన్ బాట పట్టాడు.

మరో ఓపెనర్ కే ఎల్ రాహుల్ 31 బంతుల్లో 33 పరుగులు మాత్రమే చేశాడు.ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోనిస్ 58 పరుగులు చేసి రాణించాడు. ఆయుష్ బదోని 20 పరుగులు చేయగా, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ 32 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లో ఉమేశ్ యాదవ్, దర్శన్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news