IPL 2024 : చరిత్ర సృష్టించిన కింగ్ విరాట్ కోహ్లి

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 19వ మ్యాచ్ జరుగుతుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ నిలకడగా పరుగులు చేస్తున్నారు.

ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. టోర్నీలో 7,500 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (6,755), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ (6,545), హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(6,280), సురేష్ రైనా (5,528) ఉన్నారు .కాగా, ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసింది. క్రీజ్ లో కింగ్ విరాట్ కోహ్లీ 72 పరుగులు చేయగా, సౌత్ ఆఫ్రికా డుప్లేసెస్ 44 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news