IPL Auction : ఇషాన్ కిషాన్ పై స‌న్ రైజ‌ర్స్ క‌న్ను

-

ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ కోసం అన్ని జ‌ట్ల ఫ్రొచైంజ్ ల‌తో పాటు అభిమానులు కూడా ఎదురు చుస్తున్నారు. అయితే ఐపీఎల్ 2022 కి ముందు వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జ‌ర‌గ‌నుంది. ఈ మెగా వేలంలో నాణ్య‌మైన ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకోవ‌డానికి ఫ్రొచైంజ్ లు పావులు క‌దుపుతున్నాయి. అందులో భాగంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కూడా ఆట‌గాళ్ల ఎంపిక కోసం క‌స‌రత్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. మెగా వేలం యువ సంచ‌ల‌నం వికెట్ కీప‌ర్ ఇషాన్ కిషాన్ కొనుగోలు చేయాల‌ని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెల‌స్తుంది.

ఇషాన్ కిషాన్ కోసం ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైన వెన‌క‌డుగు వేయ‌ద్ద‌ని సన్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కాగ ఇషాన్ కిషాన్ ను కొనుగోలు చేస్తే.. మంచి ఓపెన‌ర్ తో పాటు నాణ్య‌మైన వికెట్ కీప‌ర్ కూడా ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని యాజ‌మాన్యం ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగ ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేసి చాలా సార్లు తాను ప్రాతినిథ్యం వ‌హించే జ‌ట్టుకు విజ‌యాలు అందించాడు. దీంతో ఇషాన్ కిసాన్ పై స‌న్ రైజ‌ర్స్ క‌న్ను కాస్త గ‌ట్టిగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇషాన్ కిషాన్ అరెంజ్ జెర్సీ ధ‌రిస్తాడో లేదో.. మెగా వేలం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news