కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకు రోగులు పెరుగుతున్నారు. సోమవారం 139 మంది రోగులుండగా, మంగళవారం ఆ సంఖ్య 153కి చేరింది. వారిలో 35 మంది గర్భిణులతో పాటు ఆరుగురు చిన్నారులు, ఐదుగురు బ్లాక్ ఫంగస్ రోగులున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం. రాజారావు వెల్లడించారు. అయితే బాధితులంతా ఐసీయూ వార్డుల్లోనే ఉన్నారన్నారు.