ఈ రోజు చెన్నై మరియు ముంబై మ్యాచ్ లో రోహిత్ సేన నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై ఓపెనర్లు గైక్వాడ్ మరియు కాన్ వే లు ముంబై బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదిలిపెట్టకుండా పరుగులు సాధిస్తున్నారు. ముంబై చాలా స్వల్ప టార్గెట్ ను ఇచ్చినప్పటికీ తనకున్న బౌలింగ్ తో కనీసం పరుగులు అయినా నియంత్రించే అవకాశం ఉంది. కానీ వీరి జోరు ముందు పూర్తిగా తేలిపోయారు అని చెప్పాలి. త్వరగా ఇన్నింగ్స్ ను ముగిద్దాం అన్న తొందరలో ఆడుతున్న చెన్నై కు ముంబై టాప్ స్పిన్నర్ చావ్లా గట్టి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ అయిదవ ఓవర్ మొదటి బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ అవుట్ అయ్యాడు.
చావ్లా తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ ను పడగొట్టి సీనియర్ బౌలర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. గైక్వాడ్ కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి చెన్నైను పటిష్ట స్థితిలో నిలిపాడు.