టైటిల్ చూసి మీకు వెంటనే ఈ డౌట్ వచ్చి ఉండాలే.. దోమలు ఉండేది ఇంత.. మళ్లీ వాటికి వాసనలో ఇష్టా ఇష్టాలు కూడానా.. మనుషులు కనబడితే కుట్టి వదిలిపెట్టడమే వాటి ధ్యేయం అని.. మన రక్తాన్ని పీల్చడంలో దోమలు ముందుంటాయి.. పులులు, సింహాలకంటే.. దోమల వల్లే ఏటా పది లక్షల మంది చనిపోతున్నారట.. అయితే దోమలకు కొన్ని వాసనలు అంటే ఇష్టం ఉండదట.. అలాగే కొన్ని వాసనలంటే.. పడిచస్తాయట.. ఇంతకి అవి ఏంటబ్బా..!
వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు పడదు. వెల్లుల్లి రసాన్ని తీసి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి రూమ్‌లో స్ప్రే చేసుకోవాలి. లేదా వెల్లుల్లి రసాన్ని శరీరానికి రాసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను కూడా తినవచ్చు. దీంతో దోమలు దగ్గరికి కూడా రావు. కాకపోతే రూమ్ అంతా వెల్లుల్లి వాసన వస్తుంది..కదా..!
తులసి ఆకుల వాసన కూడా దోమలకు పడదు. తులసి ఆకుల నూనె మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. దీని స్మెల్ బాగుంటుందిలే..!
పుదీనా మనకు తాజాదనాన్ని అందిస్తుంది. కానీ దోమలకు ఈ వాసన నచ్చదు. పుదీనా నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమల బెడద నుంచి బయట పడవచ్చు. ఇంక పుదినా స్మెల్ సూపర్ ఉంటుంది.
లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా దోమలను దూరంగా ఉంచుతుంది. దీన్ని కూడా ఉపయోగించవచ్చు.
దోమలను తరిమికొట్టడంలో వేపాకులు, వేప నూనె అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో వేపాకుల పొగ వేసినా లేదా శరీరానికి వేప నూనె రాసుకున్నా దోమలు కుట్టవు… వేప నూనెను స్ప్రే కూడా చేయవచ్చు.
దోమలకు ఇష్టమైన వాసనలు ఇవే..!
ఒక మనిషిని దోమలను ఆకర్షించేందుకు అతని జన్యువులు కారణమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తిని దోమలు బాగా కుడితే అతనికి పుట్టే పిల్లలను కూడా దోమలు ఎక్కువగా కుట్టేందుకు 85 శాతం వరకు అవకాశాలు ఉంటాయట.
మనం వదిలే కార్బన్ డయాక్సైడ్‌కు కూడా దోమలు ఆకర్షితమవుతాయి.
కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు కూడా దోమలను ఆకర్షిస్తాయి.
O గ్రూప్ రక్తం ఉన్న వారిని దోమలు బాగా కుడతాయి.
మన శరీరం విడుదల చేసే చెమటకు కూడా దోమలు ఆకర్షితమవుతాయి.
వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల దోమలు కుట్టడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే లైట్ కలర్ దుస్తులను ధరించాలి. డార్క్ కలర్ వస్తువులకు కూడా దోమలు ఆకర్షితమవుతాయి.
దోమలు సాధారణంగా సాయంత్రం 4 గంటల తరువాత కుడతాయి. అందువల్ల ఆ సమయంలో ఇంట్లోకి దోమలను రాకుండా చూసుకోవాలి.