ఐపీఎల్:ప్లే ఆఫ్ కి చేరిన ఢిల్లీ కేపిటల్స్‌,ఆర్సీబీ…!

ఢిల్లీ కేపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు చేరాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్‌ మధ్య జరిగే మ్యాచ్‌ తర్వాత… ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ ఎవరిదో తేలుతుంది. బెంగళూరుపై గెలిచి రెండో స్థానాని సాధించింది ఢిల్లీ. ఇక ఢిల్లీ చేతిలో బెంగళూరు ఓడినా…మెరుగైన రన్‌రేట్‌తో ఆ టీమ్‌ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది.

రెండోస్థానంలో నిలిచిన ఢిల్లీ… ఎల్లుండి ముంబైతో తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్ మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపైనే… ఏ టీమ్‌కు ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ గెలిస్తే… బెంగళూరుతో శుక్రవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడుతుంది. ఒకవేళ ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓడితే… కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరుగుతుంది.