మరో అధికారిని గురిపెట్టిన, అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్…!

-

ఇరాన్ లో అమెరికా మరో రహస్య ఆపరేషన్ నిర్వహించిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. గత వారం ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సోలమానీని హత్య చేసిన అమెరికా బలగాలు మూడు రోజుల క్రితం మరో కీలక అధికారికి గురిపెట్టినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఖాసీంకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఒక అధికారిని హత మార్చడానికి అమెరికా ప్రయత్నాలు చేసింది.

వాస్తవానికి ఖాసీం కంటే ముందుగానే అతన్ని చంపడానికి అమెరికా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే ఆ అధికారి కోసం యెమెన్‌లో యునైటెడ్ స్టేట్స్ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ఇద్దరు యు.ఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. సోలైమానిని చంపినప్పుడు ఇరాన్ సైనిక నాయకత్వం మీద అమెరికా దృష్టి పెట్టినట్టు సమాచారం. దీనితోనే అమెరికా ఈ దాడికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మాట్లాడటానికి పెంటగాన్ నిరాకరించిందని, వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

ఆ ప్రాంతంలో వచ్చిన ఆరోపణలపై రక్షణ శాఖలో ఎప్పుడు చర్చ జరగలేదని పెంటగాన్ ప్రతినిధి కమాండర్ రెబెకా రెబారిచ్ పేర్కొన్నారు. కుడ్స్ ఫోర్స్ యొక్క సీనియర్ అధికారి అబ్దుల్ రెజా షహ్లాయ్ అధికారిని చంపడానికి అమెరికా ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. యు.ఎస్. ట్రెజరీ డిపార్ట్మెంట్ అతను యెమెన్లో ఉన్నారని గుర్తించింది. అయితే అమెరికా అడుగులను ఇరాన్ తన వేగుల ద్వారా పసిగడుతుందని తెలుస్తుంది. అయితే ఆ అధికారికి సంబంధించి 15 మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా అమెరికా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news