అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా ట్రంప్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగింది. ఇరాన్ టాప్ కమాండర్‌ను చంపినందుకు అగ్రరాజ్యమైన అమెరికాపై.. తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఒకరు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మా మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణించారు. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. అమాయక సైనికులను చంపాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రస్తుతం మా లక్ష్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నాం. సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదు” -హజీజాదే , ఇరాన్ కమాండర్