గాజాపై దాడుల వెనుక అమెరికా హస్తం ఉంది: ఇరాన్

-

గత కొంతకాలంగా ఇజ్రాయెల్ కు మరియు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ లకు మధ్యన యుద్ధ జరుగుతోంది. ఇక గత వారం రోజుల నుండి ఇజ్రాయెల్ గాజా పై విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. హమాస్ ఇప్పుడు తోకముడుచుకుంది అని చెప్పాలి. కాగా గాజాపై చేస్తున్న దాడుల గురించి ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతోల్లా అలీ ఖమేనీయ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు.. తాజాగా అలీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ గాజా పై చేస్తున ఈ దాడుల వెనుక అగ్ర రాజ్యం అమెరికా ఉందంటూ ఆరోపణలు చేశారు. ఎప్పుడూ కూడా క్రిమినల్స్ కు అమెరికా అండగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు అలీ. గాజాపై జరుగుతున్న ఈ దాడుల వలన గర్భిణీలు, చిన్న పిల్లలు మరియు రోగులు ఏంన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ అలీ చెప్పుకొచ్చారు.

అమెరికా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికైనా పాలస్తీనా విజయాన్ని సాధిస్తుంది అంటూ ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడారు అలీ. ఇక ఈ యుద్ధంలో పాలస్తీనాకు అన్ని విధాలుగా ఇరాన్ సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news