టీఎస్ ఆర్టీసీకి 11 రోజుల్లోనే రూ. 25 కోట్ల అద‌న‌పు ఆదాయం

-

తెలంగాణలో దసరా పండుగ ధూంధాంగా జరిగింది. ఈ దసరా పండుగ టీఎస్ ఆర్టీసీకి కోట్ల రూపాయల వర్షం కురిపించింది. దసరా పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. కేవలం 11 రోజుల్లోనే ఆర్టీసీ ఖజానాకు దాదాపు రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు టీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు నగరంలోని అన్ని పికప్‌ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు.

TSRTC Gets Huge Income of Dussehra Festival 2023 : దసరాకు టీఎస్​ఆర్టీసీపై  కాసుల వర్షం.. ఎన్ని కోట్లో తెలుసా!, tsrtc-gets-huge-income-of-dussehra- festival-2023-tsrtc-prifits-during-dussehra-festival

అయితే.. ఈసారి టీఎస్ ఆర్టీసీ కూడా డైనమిక్ చార్జీలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా డైనమిక్ ఫేర్‌నే వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోలిస్తే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడ్డారు. పండుగ సందర్భంగా అక్టోబర్ 13 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపగా.. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ. 12 నుంచి రూ. 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే దసరా సందర్భంగా అదనంగా రోజుకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా ఒక రోజులో రూ. 19 కోట్ల వరకు ఆదాయ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news