డాన్సర్ గా, నటిగా మంచి పేరు సంపాదించుకున్న రాఖీసావంత్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది వివాదాలు. ముఖ్యంగా గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్పోజింగ్తో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ భామ. అయితే తాజాగా తన భర్తపై కేసు నమోదు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే కస్టడీలో ఉన్న అతని భర్తపై ఒక ఇరాన్ మహిళా మరొక కేసును నమోదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
రాఖీసావంత్ తరచూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం, హాట్ ఎక్స్పోజింగ్ తో శృంగార తారగా పేరు సంపాదించుకోవడం ఈమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి.. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా ఎలాంటి అభ్యంతరం లేకుండా మీడియా ముందే మాట్లాడేస్తుంది ఈమె. ప్రస్తుతం రాఖీసావంత్ కి తన భర్తకి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. తన భర్త వేరొక మహిళతో ఎఫైర్ పెట్టుకొని తనను మోసం చేస్తున్నాడు అంటూ రాఖీసావంత్ అతనిపై కేసు నమోదు చేసింది.. అలాగే అతడిపై గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది. ఈ విషయంపై అతను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు.. అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న ఇతనిపై మరొక మహిళ రేప్ కేసు పెట్టడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. మైసూర్ లో ఆదిల్ దురానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇరాన్ కి చెందిన ఓ యువతి అతనిపై రేప్ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 కింద ఆదిల్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు.
ఆ సదరు యువతి ఎఫ్ఐఆర్ లో ఆదిల్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఐదు నెలల క్రితం తనని వివాహం చేసుకోమని అడగగా అందుకు అతను తిరస్కరించాడని చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి రిలేషన్స్ అతనికి కొత్త ఏమీ కాదని చాలామంది యువతలతో ఉన్నాయని చెప్పుకొచ్చింది..