Ram Pothineni : ఎయిర్ పోర్టులో రామ్..వీడియో వైరల్

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయాపటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. రామ్ 20వ సినిమా ఇది. ఇందులో రామ్ కి జంటగా శ్రీలీల నటించనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ది వారియర్’ తర్వాత ఆయన.. రామ్ పోతినేనితో నిర్మిస్తున్న సినిమా ఇది.

ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు బీ టౌన్ బ్యూటీ ఊర్వశి రౌటేలా. బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న ఊర్వశి అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కాగా, తాజాగా హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో రామ్‌ పోతినేని మెరిసారు. దీంతో రామ్‌ ఫోటోలు, వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news