గంగా పుష్కరాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ… పూర్తి వివరాలు ఇవే..!

-

గంగానది పుష్కరాలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 22న మొదలై మే 3న ముగుస్తాయి. ఈ గంగానది పుష్కరాల్లో పాల్గొనేందుకు కోట్లాది మంది వస్తుంటారు. వారణాసి, అలాహాబాద్, గంగోత్రి, హరిద్వార్, బద్రీనాథ్ లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకి పెద్ద ఎత్తున జనం వస్తారు. ఈ నేపథ్యం లో ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ స్పెషల్ ప్యాకేజీ ని తీసుకు వస్తోంది. ఏప్రిల్ 18న, ఏప్రిల్ 29న అందుబాటులో ఉంటుంది ఈ ప్యాకేజీ. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో వెళ్ళచ్చు.

 

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. గంగా పుష్కరాల యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల లో ట్రైన్ ఎక్కవచ్చు. ఈ టూర్ లో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మొదలైన ఆధ్యాత్మిక క్షేత్రాలు ని చూడచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని చూసి ఈ ప్యాకేజీ ని బుక్ చెయ్యచ్చు.

ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,955 , సింగిల్ షేర్ రూ.15,300. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ రూ.22,510, సింగిల్ షేర్ ధర రూ.24,085. అదే కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,615 , సింగిల్ షేర్ ధర రూ.31,510 గా వుంది. రెండో రోజు పూరి చూడచ్చు. ఆ తరవాత కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని చూసి మాల్తీ పాత్‌పూర్‌కు వెళ్ళాలి. నాలుగో రోజు గయ వెళ్లారు. గయలో పిండ ప్రదాన కార్యక్రమం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఐదో రోజు వారణాసి. గంగా నది పుష్కరాల్లో పాల్గొనొచ్చు. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్ణ దేవి ఆలయం ఇవన్నీ చూడచ్చు. గంగా హారతి కూడా ఉంటుంది. ఆ తరవాత అయోధ్య. ఏడో రోజు ప్రయాగ్ రాజ్. ఇలా ఈ టూర్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news