ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ఇప్పటి నుండి ట్రైన్ లో ప్రయాణం చేసే వాళ్ళకి ఫుడ్ విషయం లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తీసుకు రానుంది. దీని వల్ల ప్రయాణికులకు మంచి బెనిఫిట్ కలగనుంది అని రైల్వే శాఖ చెప్పింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ కారణంగా ఈ-కేటరింగ్ సేవలు నిలిపివేశారు. అయితే అప్పుడు ఆపేసిన ఈ సేవలని మాత్రం ఇంకా ప్రారంభించలేదు.
చాల నెలల తర్వాత ఈ-కేటరింగ్ సేవలను పునః ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే దీని వల్ల ప్రయాణికుల కి మంచి లాభం అనే చెప్పొచ్చు. తమ కి నచ్చిన ఫుడ్ ని బెర్త్ వద్దనే రిసీవ్ చేసుకోవచ్చు. ఎలా ఆర్డర్ చెయ్యాలి అనే విషయానికి వస్తే… ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ వెబ్సైట్ https://www.ecatering.irctc.co.in, 1323 నెంబర్ ద్వారా ఈ సేవలని పొందొచ్చు, లేదా ఈ-కేటరింగ్ యాప్ అయిన ‘Food on Track’ యాప్లోను ఆర్డర్ చేయొచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? ఈ సేవలని దశలవారీగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, లక్నో, భోపాల్, సూరత్, పూణె, అహ్మదాబాద్, హౌరా, పాట్నా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, సికింద్రాబాద్, ఎర్నాకుళం, ఉజ్జయిని, పన్వెల్తో పాటు పలు స్టేషన్లలో ఇది మొదట అందుబాటులోకి వస్తోంది. తొలుత 62 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందించనుంది.
भारतीय रेल द्वारा COVID संकट के दौरान बंद की गयी ई-केटरिंग सेवा को अब चुनिंदा स्टेशनों पर 1 फरवरी से पुनः शुरू करने जा रही है।
सुरक्षा संबंधी सभी नियमों का पालन करते हुए यह सेवा शुरु की जायेगी, जिससे यात्रियों के लिए बेहतर एवं मनपसंद खानपान की व्यवस्था उपलब्ध होगी। pic.twitter.com/hZ0JFyJhP4
— Ministry of Railways (@RailMinIndia) January 30, 2021