ఈమె వయసు చిన్నది. కానీ చేసే పనులు మాత్రం కష్టమైనవి. 22 ఏళ్ల పిల్లలకి నిర్ణయం తీసుకోవడం రాదు. తల్లిదండ్రులే సరైన దారిలో పెట్టాలి. కానీ ఈమె మాత్రం అంత రివర్స్. నిజంగా ఈమె చాల మందికి ఆదర్శంగా నిలిచింది. ఇక ఈమె వివరాలని చూస్తే… మహారాష్ట్రలోని నిగోస్ గ్రామం వీళ్లది. ఈమె పేరు శ్రద్ధాధావన్. ఈమె వయసు 22 సంవత్సరాలు. నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది.
ఈమె తండ్రి సత్యధావన్ పాల వ్యాపారం చేస్తుండే వాడు. కానీ అనారోగ్యం తో ఆ పాల వ్యాపారం దిబ్బతింది. దీనితో శ్రద్ధాధావన్ పాల వ్యాపారం చేయడానికి సిద్ధమయ్యింది. . ఓ పక్క చదువుతూనే, మరో పక్క ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని పశువుల పలకాలని చూసుకోవడం, పాలు పోయడం… ఇలా ఎన్నో పనులు చేస్తుంది ఈమె.
తండ్రి సూచన తో ఈమె ఈ రంగం లో ఎంతో చక్కగా రాణిస్తోంది. మొదట ఈమెకి దీని కోసం ఏమి తెలియక పోయినా ఇప్పుడు మాత్రం ఎంతో తెలివిగా, చక్కగా రాణిస్తోంది. ఈమె ఇంటింటికి తిరిగి పాలు పోస్తూ, వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. బైక్ కూడా నేర్చుకుని, బైక్ మీద అందరి ఇళ్ళకి వెళ్లి పాలు పోస్తోంది.