ఇర్ఫాన్ పఠాన్ : మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్…

-

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను భాషతో సంబంధం లేకుండా ఇష్టపడే చాలా మంది అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ తర్వాత.. అల్లు అర్జున్ స్టైల్ ను అందరూ అనుకరించడం మొదలు పెట్టారు. క్రికెటర్లు కూడా ఈయనను బాగా ఇష్టపడుతారు. తాజాగా ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అని తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజెన్ పఠాన్ గురించి చేసిన ఒక కామెంట్ మరియు దానికి పఠాన్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ నెటిజెన్ ఏమన్నాడంటే.. ” నేను అల్లు అర్జున్ డ్రెస్సింగ్ ను ఫాలో అవుతుంటాను, కానీ ఐపీఎల్లో ఇర్ఫాన్ పఠాన్ డ్రెస్ స్టైల్ చూసి… బాలీవుడ్ హీరోలా ఉన్నావు పఠాన్ భాయ్ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ను చుసిన ఇర్ఫాన్ పఠాన్ అల్ అర్జున్ అంటే నాకు కూడా చాలా ఇష్టం , నాకు కూడా ఫేవరేట్ అని రిప్లై ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news