ఏది పట్టుకున్నా కరోనా అనే అంటున్నారు. కన్న కొడుకుని ముద్దు పెట్టుకోవడానికి లేదు కన్న కూతురుని గుండెల మీద ఎక్కించుకుని ఆడుకోవడానికి లేదు. దీనితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. బయటకు చెప్పడం లేదు గాని చాలా మంది ఇప్పుడు పైకి చెప్పుకోలేని విధంగా లోపల ఏడ్చే పరిస్థితి నెలకొంది అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. పాల ప్యాకెట్, న్యూస్ పేపర్…
స్మార్ట్ ఫోన్, ఇయర్ ఫోన్స్ ఇలా ఏది చూసినా సరే కరోనా వస్తుంది అంటూ జనాలను అన్ని విధాలుగా భయపెడుతున్నారు. కరెన్సీ నోట్లు పట్టుకుంటే కరోనా వస్తుంది అనే ప్రచారం తో ఎవరూ డబ్బులు తీసుకోవడం లేదు. ఈ ప్రభావం ఇప్పుడు వ్యాపారాల మీద కూడా ఎక్కువగానే పడుతుంది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది ప్రజలకు. కరోనా రాకుండా ఉండాలి అంటే ఎం చెయ్యాలో చెప్పింది.
డిజిటల్ చెల్లింపులే మేలని, అన్ని రకాల చెల్లింపుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, బీబీపీఎస్ వంటి డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని ప్రజలు వాడుకోవాలని ఆర్బిఐ సూచనలు చేసింది. వీటి తో ప్రజలు ఎవరూ కూడా బ్యాంకు లకు వెళ్ళే అవకాశం లేదని సూచనలు చేస్తుంది. సామాజిక దూరం పాటించే అవకాశం ఉంటుంది అని సూచించింది. దీనికి బిగ్ బీ అమితాబ్ ప్రచారం చేస్తున్నారు.